డిచ్‌పల్లి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహింపబడుతుందని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్ ఒక నెల రోజుల (23 మార్చి నుంచి 22 ఏప్రిల్ వరకు) పాటు జరుగుతుందన్నారు.
యోగా శిక్షణ శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆచార్య డి. రవీందర్, విశిష్ట అతిథిగా ఆచార్య కె. శివశంకర్, ఆత్మీయ అతిథులుగా ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి, పీఆర్‌ఒ డా. వి. త్రివేణి హాజరు కానున్నారని అన్నారు. పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) డా. బి. ఆర్ నేత యోగా శిక్షకులుగా వ్యవహరించి, యోగాసనాలను నేర్పిస్తారని అన్నారు.
కావున టీయూ అధ్యాపకులు, విద్యార్థులు ఉచిత శిక్షణా శిబిరాన్ని సద్వినియోగ పరుచుకొని శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందాలని ఆయన కోరారు.