కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన 266 మందికి 2 కోట్ల 66 లక్షల 30 వేల 856 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,539 మందికి 64 కోట్ల 87 లక్షల 23 వేల 800 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగ పిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్‌, పున్న రాజేశ్వర్‌, పట్టణ, వివిధ మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »