కామారెడ్డి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సఖి కేంద్రం నిర్వహణకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ముఖా ముఖి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖా ముఖి కార్యక్రమం చేపట్టారు.
స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రం నిర్వహణలో చేపట్టవలసిన అంశాల గురించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఆర్డిఓ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా బాలల అభివృద్ధి అధికారి స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.