కామారెడ్డి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం వేల్పు గోండలో నర్సరీని బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సందర్శించారు. నర్సరీ లో మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు.
వచ్చే జూన్ నాటికి మొక్కలు నాటడానికి అనువుగా సిద్ధం చేయాలని సూచించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.