ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటకు చెందిన లాలమ్మల మంజులకు ఆపరేషన్‌ నిమిత్తమై పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన టాక్స్‌ కన్సల్టెంట్‌ శ్రీనివాస్‌కు తెలియజేయగానే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారని కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు తెలిపారు.

గత 14 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం జరుగుతుందని 10వేల యూనిట్ల రక్తాన్ని అందజేశామని, కరోణ సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేయడం జరిగిందని, రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 కి సంప్రదించాలన్నారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు నర్సింగ్‌, రాజు, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »