కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండలానికి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బిచ్కుంద నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం వంటి పనులు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
తరగతి గదులు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల ను పర్యవేక్షణ చేయాలని సూచించారు. అంతకుముందు మన ఊరు- మన బడి కార్యక్రమంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.