సిసి రోడ్డు పనులకు భారీగా నిధులు

కామారెడ్డి, మార్చ్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి 7 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్ల రూపాయలు మజురైనట్టు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు.

కామారెడ్డి 1 కోటి 28 లక్షలు, దోమకొండ 2 కోట్లు, బీబీపెట్‌ 2 కోట్ల 20 లక్షలు, భిక్కనూర్‌ 4 కోట్ల 20 లక్షలు, రాజంపేట 80 లక్షలు, మాచారెడ్డి 4 కోట్లు 22 లక్షలు, రామారెడ్డి 1 కోటి 30 లక్షల రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌కే ముజీబుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »