ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. అపర్ణ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడుతూ… మహిళా శక్తి అనంతమైందని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల విద్యాభ్యసన శాతం అధికంగా ఉందన్నారు. ఫలితాల వెల్లడిలో అన్ని అనుబంధ కళాశాలలను కలుపుకొని కూడా బాలికలదే పైచేయి ఉన్నట్లుగా తెలిపారు.

నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరిండెంటెండ్‌ డా. ప్రతిమా రాజ్‌ సేవలను కొనియాడుతూ కరోనా కాలంలో డాక్టర్స్‌ ప్రధాన స్రవంతిలో వారియర్స్‌గా నిలిచిన సంగతి గుర్తు చేశారు. అందులో మహిళా డాక్టర్స్‌, మహిళా నర్సుల గణనీయమైన పాత్రను గూర్చి తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాల చరిత్రను వివరించారు. ఐక్యరాజ్య సమతి మహిళా సాధికారత దశాబ్దోత్సవాలను నిర్వహిస్తూ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో పురోభివృద్ధిని కాంక్షించిందన్నారు. ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాలలో సగం అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిరదన్నారు. ఈ సంఘటిత శక్తి మహిళా లోకానికి అత్యంత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరిండెంటెండ్‌ డా. ప్రతిమా రాజ్‌ విచ్చేసి మాట్లాడుతూ.. మహిళల్లో ఆత్మవిశ్వాసం, కరుణ, జాలి, ప్రేమ, అనురాగం, ఆత్మీయత అనంతంగా ఉంటుందన్నారు. శరీర అవయవ రీత్యా, సత్తువ రీత్యా స్త్రీలలోనే ఎక్కువ శక్తి ఉంటుందని తెలిపారు. ప్రసవ వేదనను దాటుకొని వచ్చిన స్త్రీల శక్తి యుక్తులను గూర్చి వేరే విధంగా ఆలోచించవలదిన పని లేదని అన్నారు. అదే సమయంలో స్త్రీలు సాధించలేనిది ఏది లేదన్నారు.

ఆలోచనా శక్తిలో గాని, సృజనాత్మక శక్తిలోగాని వినూత్నంగా ఉంటారని పేర్కొన్నారు. అపరిమితమైన మేధో శక్తి ఉంటుందన్నారు. ఇంటి పనుల నుంచి ఖగోళా రంగం వరకు ఉవ్వెత్తున ఎగిసిన మహిళా స్వయం శక్తిని కొనియాడారు. భారతదేశంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న ప్రముఖ మహిళలను ఈ సందర్భంలో గుర్తు చేశారు. భారతదేశ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, టైంస్‌ మ్యాజైన్‌ ఆఫ్‌ ఇండియా ముఖ చిత్రంగా ప్రచురించిన సిటిజన్‌ అమైండ్‌ మెంట్‌ ఫండ్‌ బిల్కస్‌ బాను, మెడిసన్‌ ప్లాంటేషన్‌ చేసి పద్మశ్రీ పొందిన తులసీ గౌడ, డిఫెన్స్‌ హార్మ్‌ ఫోర్స్‌ మాధురీ, కోవిద్‌ – 19 ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రీతి సుల్తాన్‌, కరోనా కాలంలో అత్యధిక కేసులు నమోదైఅన్‌ కేరళ ఆరోగ్య శాఖామాత్యులు కె. కె. శైలజ, కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ శ్రీమతి నిర్మలా సీతారామన్‌ తదితరులను గూర్చి, వారి యుక్తులను గూర్చి విశేషంగా కొనియాడారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థుల సమయం చాలా విలువైందని గుర్తు చేశారు.

మరొక ప్రత్యేక అతిథిగా మ్యూజిక్‌ కళాశాల అసిస్టెంట్‌ లెక్చరర్‌ స్వప్నా రాణి విచ్చేసి మాట్లాడుతూ… మహిళల సంకల్ప శక్తి అనంతమైందన్నారు. సృష్టే స్త్రీల చేతుల్లో ఉందన్నారు. స్త్రీల అంచంచలమైన శక్తి సామర్థ్యాలను పురస్కరించుకొని ఒక మంచి పాట పాడారు. సమావేశంలోనే ఇదివరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ స్థాయి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముందుగా నవ్య, నందిని, కిరణ్మయి, సాత్త్విక, వైష్ణవి తదితరులు ద్యాన్స్‌, పాటలు, కవితలతో అలరించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »