నిజామాబాద్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరం లో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.