నిజామాబాద్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కమిషన్ దారులకు కమిషనరేట్ పెంచాలని డిమాండ్ చేస్తూ బీడీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు బీడీ కమిషన్ దారుల యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో డిమాండ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కమిషన్ దారుల యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయినాథ్, టీ.నర్సయ్య లు మాట్లాడారు.
బీడీ పరిశ్రమలోని కమీషన్ ఏజెంట్ల కమిషన్ రేటు పెంపుదల అగ్రిమెంటు 31.03.2022 తేదీతో ముగిసిందన్నారు. ఇకనుండి బీడీ కమిషన్ రేటు వెయ్యి బీడీలకు దగ్గరి ప్రాంతాలకు 15 రూపాయల నుండి 19 రూపాయలకు, దూరప్రాంతాలకు రూ.15.05 పై నుండి రూ.19.05 పై.లకు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కమిషన్ దారుల వద్ద తీసుకున్న డిపాజిట్ డబ్బులు బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి, వడ్డీ ఇవ్వాలన్నారు.
వెయ్యి బీడీలకు ఇచ్చే తునికాకుకు 100 గ్రాముల మార్జిన్ ఇవ్వాలన్నారు. తునికాకు గోనెసంచులు ఇచ్చేటప్పుడు తూకంవేసి ఇవ్వాలన్నారు. లేబర్ లైసెన్స్ యాజమాన్యాలే భరించాలన్నారు. బీడీ కార్మికుల వేతనం మరియు కరువు భత్యం పెరిగిన దాంట్లో 10 శాతం బీడీ కమిషనరేట్ పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, బీడీ కమిషన్ దారుల యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆనంద్ పాల్గొన్నారు.