నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రగతి భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా 210 పరీక్ష అట్టలను బీసీ హాస్టల్ పిల్లలకు అందచేయటం జరిగింది. వీటిని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ కలిసి దాతలుగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్, నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా.శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.