కామారెడ్డి, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కీర్తిశేషులు సానెబోయిన నర్సవ్వ – బాల్ కిషన్ ముదిరాజ్ కామారెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారుల సహాకారంతో వి.టి. ఠాకూర్ లయన్స్ కంటి హాస్పిటల్ కామారెడ్డి అధ్వర్యంలో ఉచితంగా కంటి పరిక్ష క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపునకు కామారెడ్డి పరిసర ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు చేసుకుని అవసరమైన మందులు, కంటి అద్దాలు తీసుకున్నారు.
కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి తరువాత తేది ఇచ్చి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి 385 మంది హాజరై కంటి పరీక్షలు చేసుకున్నారు. ఇందులో 238 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది, 68 మందికి ఉచితంగా ఐ డ్రాప్స్, కావలసిన మందులు అందజేశారు.
52 మందికి కంటిలో మోతిబిందు నిర్దారణ చేసి వారికి విడతల వారిగా కంటి ఆపరేషన్లు చేస్తామన్నారు. కార్యక్రమాన్ని డా. సానబొయిన లింబద్రి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డా.సానబొయిన లింబాద్రిని పట్టణ ముదిరాజ్ సంఘం తరపున సన్మానం చేశారు. కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గెరిగంటి లక్ష్మినారాయణ, నీలకంఠం, గంగారాజ్, కన్కంటి రాజు, కన్కంటి రమేష్, సానబొయిన తిరుపతి, కాకర్ల ఆశయ్య, బట్టు సుశీల్ తదితరులు పాల్గొన్నారు.