నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి వేడుకను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.