డిచ్‌పల్లి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రెరీ (విజ్ఞాన సౌధ) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రిపేర్ అవుతున్న సందర్భంలో విద్యార్థులను వీసీ పలకరించారు. విద్యార్థులందరు రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలన్నారు.
తాము అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. నిష్ణాతులైన విషయ నిపుణులను ఆహ్వానించి మంచి ప్రసంగాలను ఇప్పించి తర్ఫీదు ఇప్పిస్తామన్నారు. విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, రెఫరెన్స్ పుస్తకాలను, రీసర్చ్ పుస్తకాలను, సబ్జెక్ట్ పుస్తకాలను, జర్నల్స్ ను లైబ్రేరియన్‌ను అడిగి తెలుసుకున్నారు.
వాటికి సంబంధించిన ప్రత్యేక విభాగాలను తనిఖీ చేశారు. ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అడ్మినిస్ట్రేషన్ అహర్నిశలు అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు. వీసీ సందర్శన వెంట లైబ్రేరియన్ డా. సత్యనారాయణ, లక్ష్మణ్, పవన్, పుష్ప, డా. వి. త్రివేణి తదితర లైబ్రెరీ సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ఉన్నారు.