నిజామాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 15 రోజులుగా బీడీ కార్మికులకు పని లేకుండా చేసిన కిషన్ లాల్ రామ్ స్వరూప్ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కార్మికులకు కార్మిక శాఖకు ఎలాంటి సమాచారం లేకుండా గత 15 రోజులుగా బీడీ ఫ్యాక్టరీని బందు చేసి కార్మికులకు పని లేకుండా చేసిన యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణం బీడీ కార్మికులకు ఇరవై రోజుల పని కల్పించాలని మూడు నెలలుగా బాకీ ఉన్న కార్మికుల వేతనాలను చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్‌కి ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి కిషన్, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు మురళి, రాస మహేష్, గడ్డం శ్రీనివాస్, దుర్గయ్య, సాయమ్మ, లక్ష్మి, లలిత, స్వరూప, పల్లవి సుమారు 400 మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.