డిచ్‌పల్లి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతి టి. సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాండిచ్చెరి నుంచి నేషనల్ ఇన్సిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చెరి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాగుట్ల చంద్రశేఖర్ విచ్చేసి ‘‘ఫైనాన్షియల్ క్లీన్ ఎనెర్జీ ప్రాజెక్ట్స్: ఎవిడెన్స్ ఫ్రం మేజర్ ఇన్వెస్ట్ మెంట్ కంట్రీస్’’ అనే అంశంపై ప్రసంగించారు. స్వచ్చమైన ఇందన వనరులకు పెట్టుబడులను గూర్చి విశ్లేషించారు. పర్యావరణ సమస్య, పేదరిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయని అన్నారు.
అభివృద్ధి జరిగిన దేశాలతో సహా పేదదేశాలు ఇందన వనరులతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ఏ రెండు దేశాలలో యుద్ధం సంభవించినా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం పెట్టుబడులు ఇందన వనరులపైనే ఖర్చు పెడుతున్నాయని అన్నారు.
ఇందన వనరుల సమగ్రాభివృద్ధికి అందరు కృషి చేయాలని కోరారు. ఇందనాన్ని పొదుపుగా వాడుకోవాలని సూచించాలన్నారు. సోలార్, విండ్, కోల్ ద్వారా ఇందనాల తయారీని అధికం చేయాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక పురోగతిలో ఇందన వనరుల అవసరాలు అత్యధికమని అన్నారు. కావున విద్యార్థులు విద్యుచ్చక్తి చోదకాల మీద అవాగాహన కలిగి ఉండాలన్నారు. వాటి స్వయం సమృద్ధికి కృషి చేయాలన్నారు. నూతన ఆవిష్కరణలు చేసి ఇందన వనరుల కల్పన సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్త డా. రాగుట్ల చంద్రశేఖర్‌ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఘన్మగా సన్మానించారు. కార్యక్రమంలో అప్లైడ్ ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు డా. పాత నాగరాజు, డా. రవీందర్ రెడ్డి, డా. పున్నయ్య, డా. స్వప్న, డా. శ్రీనివాస్, డా. దత్తహరి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.