కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మంగళవారం బీజేవైఎం కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పాఠశాలలు సందర్శన చేసి విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ అవగాహనా ఇస్తూ, వ్యాక్సిన్ తీసుకొని వారు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బిజెవైఎం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ బాధ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పటికి నరేంద్ర మోదీ కృషి వల్ల భారతదేశం కరోనాను అదిగమించిందన్నారు. దేశంలో ఇప్పటికీ దాదాపు 186 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆర్థికంగా కూడా భారత్ ఇప్పుడు మోదీ సారథ్యంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతుందని పేర్కొన్నారు.
పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించుకొక పోతే వెంటనే వేయించుకోవాలని సూచించారు.