కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రాష్ట్రప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు, యాసంగి వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంపై తెరాస నాయకులు ధర్నాలు చేయడం, తెరాసపై బిజెపి నాయకులు దర్నాలు చేయడం సిగ్గు చేటని, కపట నాటకాలు ఆడుతూ కాలయాపన చేస్తూ రైతులను, ప్రజలను దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై నిరసనగా వంటా-వార్పు, సీఎం కెసిఆర్, పిఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, ఓబిసి జిల్లా చైర్మన్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మధ్య చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ధాత్రిక సత్యం, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, మాజీ కౌన్సిలర్లు బట్టు మోహన్, గొనె శ్రీనివాస్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, రాజంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి,హనుమండ్ల రాజు, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, సబ్బని శంకర్, అహిమద్ ఉల్లా, నౌసి లాల్, బొట్టు శ్రీనివాస్, మేతిని శంకర్, రాజాగౌడ్, అబ్రబోయిన స్వామి, మధు దోమకొండ, బండి ప్రవీణ్, కృష్ణ, టెక్రియల్ శ్రీనివాస్, వేముల సత్యం, లక్కపత్ని గంగాధర్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.