ఆర్మూర్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఎంతో గొప్పదని అణగారిన జాతుల కోసం ఎంతో శ్రమపడి కష్టాలను ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించడం జరిగిందని అన్నారు మూల నివాసులైన మనం ఆయన అడుగుజాడల్లో నడిచి రాబోయే రోజుల్లో కులాలు మతాలకు తావివ్వకుండా అంబేద్కర్ చెప్పిన విధానంలో ప్రయాణం కొనసాగాలని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మేధావిగా అమెరికా ప్రకటించింది ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రాజకీయ పదవులు వస్తున్నాయని అన్నారు.
నిమ్నజాతి ప్రజలకు ఎంతో మేలు చేశారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఈరోజు మనం రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించాలంటే రాజకీయ పదవులు సంపాదించాలంటే అది ఒక్క రాజ్యాంగం ద్వారానే అని గుర్తుంచుకోవాలి, ఓటు హక్కును కూడా రాజ్యాంగం ద్వారానే వచ్చిందని గుర్తు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జమున, ఉప సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ రాజ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మహిపాల్, టిఆర్‌ఎస్ నాయకులు ఆనంద్ రెడ్డి, ఆర్మూర్ మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, రైతు నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, మాజీ సర్పంచ్ మూగ ప్రభాకర్, మాజీ ఎంపిటిసి ప్రసన్న, ప్రభుదాస్, తెరాస నాయకులు గణేష్, విడిసి చైర్మన్ నవీన్, బొంబాయి మాల మహానాడు అధ్యక్షులు బత్తుల లింగం, గాయకులు దామోదర్, సంఘమిత్ర, భీమ్ ఆర్మీ జిల్లా నాయకులు డాన్ శీను, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దేవారం, జనార్ధన్, ప్రశాంత్, సికిందర్, సంఘ సభ్యులు మోహన్, మాణిక్యం, ఎస్ మోహన్, పురుషోత్తం, అంబేద్కర్ యువజన సంఘం యూత్ సభ్యులు పాల్గొన్నారు.