కామారెడ్డి, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సింగ్‌కు చెందిన రేణుక (21) గర్భిణీకి అత్యవసరంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెదక్ ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయగా వెంటనే రాత్రి వేళ అయినా స్పందించి రక్తాన్ని సకాలంలో అందించారు.
రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ మానవత్వానికి మించిన మతం లేదని సమాజంలో తోటి వారు ఇబ్బంది పడుతుంటే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మంచి మనసున్న మనుషులే రక్తదాతలనీ ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తదానానికి ముందుకు వస్తారని దానికి నిదర్శనమే నీశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీకి సకాలంలో రక్తం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, నరసింహ, రాజు పాల్గొన్నారు.