యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా గత సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »