తమిళననాడు ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి జూన్ 30 వరకు 12 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
జూన్ 19 నుంచి 30 వరకు…
అత్యవసర సర్వీసులకు మినహాయింపు.
కేసులు పెరుగుతున్నదున నిర్ణయం..
లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు అంబులెన్స్ లు అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అద్దె ఆటోలు, టాక్సీ, ప్రైవేట్ వాహనాల వినియోగం అనుమతిలేదు . అత్యవసర, వైద్య సేవలకు మాత్రమే ప్రైవేట్ వాహనాల వినియోగానికి అనుమతి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, విద్యుత్, ట్రెజరీ, ఆహారం, నీటి సరఫరా, కార్మిక, సహకార, ఆహార మరియు వినియోగదారుల రక్షణ వంటి విభాగాలు పూర్తి సిబ్బందితో ఎసెన్షియల్ సర్వీసెస్ సెక్రటేరియట్ పని చేస్తుంది.