కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట మాధవరావు, జెడ్పి సిఈవో సాయాగౌడ్ కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.