సమాజం పట్ల అంకితభావం ప్రశంసనీయం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) 1,2,3,4 యూనిట్‌ల ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ, నిజామాబాద్‌ వారి సహకారంతో సోమవారం ఉదయం న్యాయ కళాశాల ఆవరణలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.

అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో ఉత్తమైనదని అన్నారు. రక్తదానం చేస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌లు కలిసి ఈ శిబితం నిర్వహించడం బాగుందన్నారు. సమాజం పట్ల అంకిత భావం, దృఢ సంకల్పం కలిగి ఈనాడు రక్తాన్ని దానం చేస్తుండడం ప్రశంసనీయమని అన్నారు. మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదన్నారు. విద్యార్థుల్లో మానవీయత, సంఘటిత శక్తి వెల్లివిరియడానికి ఇటువంటి శిబిరాలు దృష్టాంతంగా నిలుస్తాయన్నారు.

టీయూలో నిరంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, అందులో ముఖ్యంగా కొంత మంది విద్యార్థులు అనేక సందర్భాల్లో రక్తాన్ని దానం చేశారని గుర్తు చేశారు. వీరు మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సామాజిక మానవ ధర్మాన్ని పెంపొందించే శిబిరాలను నిర్వహిస్తున్న రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ను, సిబ్బందిని ప్రశంసించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కె. శివశంకర్‌, ప్రిన్సిపాల్‌ డా. సిహెచ్‌. ఆరతి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా కె. రవీందర్‌ రెడ్డి, నిజామాబాద్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఆంజనేయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ డా. ఎన్‌. స్వప్న, డా. ఎ. మహేందర్‌, డా. టీ. సంపత్‌, డా. బి. స్రవంతి నిర్వహించారు. 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »