ఈ నెల 25 వరకు బి.ఎడ్‌. పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 25 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు.

అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 26 వ తేదీ వరకు, 200 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 27 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 28 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.

కావున ఈ విషయాన్ని బి.ఎడ్‌. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »