కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సంరక్షించుకోవడానికి పాటించవలసిన సూచనల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ సందర్భంగా మాట్లాడారు.
గేదెలు, గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకం పోషణలో వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మేతకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు తీసుకెళ్లి తదుపరి చెట్ల నీడన వాటిని ఉంచాలని కోరారు. పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కోళ్ల పెంపకం దారులు వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినందున షెడ్లపై తుంపర్ల సేద్యం ద్వారా నీటిని చల్లాలని కోరారు.
గోనె సంచులను తరచుగా నీటితో తడుపుతూ షెడ్డు ఉష్ణోగ్రత పెరగకుండా పైన కట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ పిడి వెంకట మాధవరావు, సిపిఓ రాజారామ్, జడ్పీ సీఈవో సాయా గౌడ్, జిల్లా పశు సమర్థక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథ్ చారి, అధికారులు పాల్గొన్నారు.