నిజామాబాద్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462-220185 కు సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కంట్రోల్ రూం పని చేస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.