ఘనంగా మహనీయుల జయంత్యుత్సవాలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్‌ రాం, మహాత్మా జ్యోతి బాఫులే, డా. బాబా సాహెబ్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి విచ్చేసి కీలక ప్రసంగం చేశారు. మహనీయులను స్మరించుకోవడం మానవ నైతిక ధర్మమని అన్నారు. వారి నుంచి స్ఫూర్తిని, తేజస్సును పొందాల్ని అన్నారు. యువతకు ఈ శక్తి సంపద అత్యవసరమని అన్నారు. గొప్ప సామాజిక పునరుజ్జీవన కర్త మహాత్మా జ్యోరావు బాఫూలే, స్త్రీ జనోద్దరణ క్రాంతి బాయి సావిత్రీబాయి ఫూలే, సమానత్వ క్రాంతి దాత డా. బాబా సాహెబ్‌ బిఆర్‌ అంబేద్కర్‌, రాజకీయ దురందర నేత బాబు జగ్జీవన రాం జయంత్యుత్సవాలు, వారి కీర్తి పతాక విద్యార్థుల్లో అనంతమైన ఆత్మ విశ్వాసాన్ని, దృఢ నిశ్చయాన్ని పొందుతారని అన్నారు.

మన కొరకు, మంచి సమాజం కొరకు ఆణిముత్యం లాంటిజాతి కొరకు వీరి జీచిత చరిత్రలను అధ్యయనం చేయాలని అన్నారు. భారతదేశ చరిత్ర పూర్తి స్వరూపం వారి జీవనోద్యమ చరిత్ర ప్రదర్శిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలతో, విద్యర్థులతో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు అన్యోన్య సంబంధం ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ న్యాయవాది, సామ్యవాది, ప్రజాస్వామ్యవాది, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త డా బాబా సాహెబ్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ అని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్‌ నాలెడ్జ్‌ డే అని, విజ్ఞాన దినోత్సవంగా అభివర్ణించారన్నారు.

సమానత్వానికి చిహ్నంగా ఆయన జన్మదినోత్సవాన్ని చిత్రించిందని అన్నారు. ఐక్యతా దినోత్సవంగా కూడా ప్రదర్శించిందని అన్నారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు, అనేక విశ్వవిద్యాయాలు ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ ఆయనను స్ఫూర్తివంతంగా తీసుకుటాయని అన్నారు. ఆయన విజ్ఞానం ప్రపంచ మానవాళిని ఆకర్షిస్తుందన్నారు. ప్రపంచానికి అవసరమయ్యే జ్ఞానం, విజ్ఞానం, సిద్ధాంతాన్ని ప్రబోధింపబడిరదని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే నాడు గొప్ప విద్యావంతమైన సమాజం, సమానత్వ సమాజం, ఆర్థిక సిద్ధాంతం ఏర్పడిరదన్నారు.

దేశంలో గొప్ప గొప్ప రాజకీయ పార్టీలు వెలువడడానికి కారణమైనాయని అన్నారు. అన్నింటి కంటే ఎక్కువ విద్యకు ప్రాముఖ్యం ఇస్తూ అనేక చర్చోపచర్చలను, పరిపాదనలను కొనసాగించారని అన్నారు. ఈ విద్య ద్వారానే ఆయన ఒక సామాన్య సామాజిక కార్యకర్త నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా నిర్మాణం చెందారని అన్నారు. ప్రతి విద్యార్థి అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. ఒక టీచర్‌గా, ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో పాఠ్యప్రణాళికలలో గుణాత్మక మార్పులను ఏ విధంగా సాధించవచ్చో తెలిపారు.

మహాత్మా జ్యోతి బాఫూలే, సావిత్రీ బాయి ఫూలే మార్గనిర్దేశంలో కులమత రహిత సమాజాన్ని కాంక్షించారు. దీని బీజం కొలంబియా విశ్వవిద్యాలయంలో పడిరదన్నారు. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జాన్‌ డ్యూబే ప్రబోధంతో సామ్యవాద, ప్రజాస్వామిక సమాజ నిర్మాణ సూత్రాల్ని తెలుసుకున్నారు. ప్రొఫెసర్‌ జాన్‌ డ్యూబే నుంచి ప్రజాస్వామిక విద్యావలంబన సాధించారని అన్నారు. ఆయన 1917 లో సమర్పించిన మొట్ట మొదటి పత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందన్నారు.

ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ మహనీయులు అందరు ఒక గొప్ప జాతీయ నాయకులుగా, విద్యావేత్తలుగా, రాజకీయ దురందరులుగా, ఆర్థిక వేత్తలుగా, స్వాతంత్ర సమర యోధులుగా వెలుగొందారని అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ మూర్తిమత్వాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని గూర్చి వివరించారు. సభలో ఆర్‌. లింబాద్రి చేతుల మీద తెలంగాణ విశ్వవిద్యాలయపు 2022 సంవత్సర డైరీని ఆవిష్కరించారు. సభా అధ్యక్షులుగా ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డా. ఎం. బి. భ్రమరాంబిక నిర్వహించారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »