28 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ ఎల్‌ ఎం, ఎల్‌ ఎల్‌ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ మరియు ఐఎంబిఎ ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 28 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు మే 10 వ తేదీన నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.

అంతేగాక 100 రూపాయల అపరాధ ఆలస్య రుసుముతో మే నెల 2 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, పీజీ విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »