డిచ్‌పల్లి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ రచించిన ‘‘అరాచకుడి స్వగతాలు’’ అనే పుస్తకం ఆవిష్కరింపబడిరది. ఆర్ట్స్ డీన్ ఆచార్య కనకయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ డా. జి.వి. రత్నాకర్ తనకు మంచి మిత్రుడని, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో చదువుకొనే రోజుల్లో అంబేద్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటులో ఆయన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు. దళిత చైతన్యం, సంస్కృతి, జన జీవనం ఆయన రచనల్లో ప్రతిఫలించిందన్నారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా. ప్రవీణాబాయి, డా. పార్వతి, డా. జమీల్ అహ్మద్, డా. బాల శ్రీనివాస మూర్తి, డా. త్రివేణి, డా. మాయాదేవి, డా. దత్తహరి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.