రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్బంగా ఆయన మాట్లాడారు.

ఆడపిల్ల పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఇబ్బందులు వాడేవారని వారి ఇబ్బందులను దూరం చేయడానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా 1 లక్ష 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 26 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పట్లోళ్ల దుర్గా రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వాజీద్‌ అలీ, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, నాయకులు విఠల్‌ రెడ్డి, అప్జల్‌, గైని రమేష్‌, శ్రీధర్‌ రెడ్డి, చాకలి రమేష్‌ కుమార్‌, ఆర్‌ఐ విజయ్‌ కుమార్‌, ఎంపీటీసీ దేవదాస్‌, మండల కో ఆప్షన్‌ మాజీ సభ్యులు హైమద్‌ హుసేన్‌ తదితరులు ఉన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »