భారతదేశ నూతన నావిగేషన్‌ వ్యవస్థకు జియో విభాగం పని తీరు భేష్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మాటిక్స్‌ విభాగం,ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సౌత్‌ క్యాంపస్‌లో ఇండియన్‌ జి.పి.ఎస్‌. నావీక్‌ అండ్‌ ఇట్స్‌ ఫ్యూచర్‌ అప్లికేషన్స్‌ అనే అంశంపై జాతీయ కార్యశాల నిర్వహించడం జరిగిందని, అలాగే సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయబడిన నూతన జి.ఐ. ఎస్‌ అండ్‌ జి.పి.ఎస్‌.జియో ల్యాబ్‌ని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీంద్ర గుప్తా దక్షిణప్రాంగణంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీంద్రగుప్తా మాట్లాడుతూ ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయమని, మల్టీ డిసిప్లినరీ వర్క్‌ షాప్‌ నిర్వహించడం ద్వారా పలు అంశాలు విద్యార్థులకు ఉపకయుక్తమవుతాయని, డిపార్ట్మెంట్‌ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే యూనివర్సిటీ కూడా మరింత అభివృద్ధికి సహకారం అందిస్తుందని, దానికి తోడూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ జియో ఇన్ఫోర్మటిక్స్‌ శాయశక్తులా ముందుండి నడిపించాలని అన్నారు.

అంతకుముందు నూతన ల్యాబ్‌ ప్రారంభించారు. కార్యశాలకు విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ బాలకిషన్‌ మాట్లాడుతూ జి.ఐ.ఎస్‌, జి.పి.ఎస్‌ ప్రస్తుత తరుణంలో విశ్లేషణ ఆదరణను చూరగొంటూ అన్ని రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. జియో ఇన్ఫోర్మటిక్స్‌ విభాగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం భూగోళాశాస్త్రం విభాగం వారితో మరింత అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుందన్నారు.

ఈ సందర్భంగా కార్యశాల కన్వీనర్లు డా.ఆర్‌.సుధాకర్‌ గౌడ్‌, ఆచార్య పి.నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే జి.పి.ఎస్‌.వ్యవస్థ కలిగిన ఆరు దేశాలలో భారత దేశం అత్యంత శక్తివంతమైన ఇండియన్‌ నావిక్‌ వ్యవస్థను రూపొందించిందన్నారు. ఈ సమూల వ్యవస్థను ఉపయోగించుకొని మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం విస్తృత మైన ఇండియన్‌ నావిక్‌ సిస్టంని అభివృద్ధి చేస్తుందని, ప్రస్తుతం 14 శాటిలైట్‌లలో 7కు పైగా వాటి యొక్క సిగ్నేల్స్‌ (సంకేతాలను) డి.ఓ.పి అందుకుంటుందని, వీటి పని తీరు ఆధారంగా అనేక రకాల ఉపయుక్తకరంగ వుంటూ భారతదేశం ఐ. ఆర్‌.ఎన్‌. ఎస్‌ (ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌) వ్యవస్థను రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో ఇస్రో వారు జి.పి.ఎస్‌.ను ఉపయోగించకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌, ఇండియన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, బయో మెడికల్‌ వంటి వాటితో బాటు సముద్ర తీర ప్రాంతాలల్లో గస్తీ నౌకలకు, దేశ భద్రతకు ముప్పురానియకుండా ఈ టెక్నాలజీ ఎనలేని ఆవిష్కరణలకు తెర తీస్తుందని తెలిపారు.

అంతే గాకుండా మొబైల్‌ ఫోన్‌లలో జిపిఎస్‌కు బదులుగా ఇస్రో వారు తయారు చేసిన స్పేస్‌ అప్లికేషన్‌లను ఉపయోగిస్తూ యుద్ధ సమయంలో సైతం ఏ దేశ సహకారాలు లేకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించిందన్నారు. నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డేవలప్మెంట్‌ శాస్త్రవేత్త డా.ఎం.వి.రవి బాబు కార్యశాలలో మాట్లాడుతూ పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో సైతం ఈ జిపిఎస్‌ టెక్నాలజీ ద్వారా సరికొత్త పంథాతో ముందుకెళ్తు మరిన్ని నూతన ఆవిష్కరణలకు జియో విభాగం, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ విభాగాల సహాయంతో ప్రజలకు విశ్లేషణమైన సేవలందించడంలో తోడ్పాటునందిస్తున్నారు.

కార్యక్రమంలో సౌత్‌ క్యాంపస్‌ ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ డా.వీరభద్రం, కార్యశాల కో కన్వీనర్లు డా.కవితా తోరణ్‌, డా.ప్రతిజ్ఞ, డా.సబితా, డా.నారాయణ, ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా.ఆనంద్‌, డా.ఎం.విజయ్‌ కుమార్‌ శర్మ, డా.యాలాద్రి, డా.అంజయ్య, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ అధ్యాపకులు సూచరణ్‌, శివరాణి, పరిశోధక విద్యార్థులు, తెలంగాణ విశ్వవిద్యాలయ, ఉస్మానియా విశ్వవిద్యాలయ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »