కామారెడ్డి, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందూ, ముస్లింలు సోదర భావంతో పండుగలను నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. టిఎన్‌జిఓఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
మతాలకతీతంగా ఐకమత్యంతో పండగలు జరుపుకోవాలని సూచించారు. టిఎన్‌జిఓఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. హిందూ, ముస్లింలు పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రూప్ ఫోర్త్ మైనార్టీలకు ఉచిత శిక్షణ కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపుకలెక్టర్ చంద్రమోహన్, టిఎన్‌జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, జుగల్ కిషోర్, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.