భారత ఆర్మీ కల్నల్ ఇద్దరు జవానులవీర మరణం.
అమర జవాన్ సంతోష్ ది సూర్యపేట
లడక్ ప్రాంతంలో చైనా కయ్యానికి కాలు దువ్వింది. భారత్ చైనా బలాగాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశనికి చెందిన ఆర్మీ కల్నల్ తోపాటు ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షన జరిగింది.
అమరుడైన కల్నల్ సంతోష్ తెలంగాణ లోని సూర్యాపేటకు చెందిన వారు. ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. దీనికి భారత ఆర్మీ కూడా ధీటుగా బదులిచ్చింది. చైనా వైపు కూడా మరణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘర్షణలో తమ సైనికులు చచ్చారని ఒప్పుకుంటుంన్న చైనా ఎంత మంది చనిపోయారన్నది వెళ్లడించడంలేదు. కల్నల్ సంతోష్ లడాక్ ఇన్ ఫాంట్రీ విభాగానికి కమాండెంట్ ఉన్నారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు.
ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు చైనా దుశ్చర్యలకు పాల్పడుతుంది. 1975 తర్వాత చైనాతో ఘర్షణలో మన సైనికులు మరణించడం ఇదే మొదటి సారి.