డిచ్పల్లి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ల ఫీజు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు మే నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో మే నెల 2 వ తేదీ వరకు, 200 రూపాయల అపరాధ రుసుముతో మే నెల 5 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో మే నెల 6 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.
కావున ఈ విషయాన్ని బి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.