గాంధారి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు.స్థానిక రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో చెక్కులతో పాటు తన స్వంత ఖర్చులతో ఒక్కో లబ్ధిదారునికి పట్టు చీరను ఎమ్మెల్యే బహుకరించారు.
ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే ఈ రోజులలో పేదింటి ఆడపిల్ల పెళ్ళికి పెద్ద మనసుతో లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తున్న ఒకే ఒక్క మహనీయుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్టంలో ఎవరూ అడగకున్న కుటుంబంలో పెద్ద అన్నగా ఆడపిల్ల పెళ్లి సహాయం చేస్తున్నారని అన్నారు. అదే విదంగా ఆడపిల్ల పుట్టగానే 13 వేల రూపాయల కెసిఆర్ కిట్‌ను ప్రభుత్వం అందజేస్తుందని గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడా అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ ఉందని అన్నారు. రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తున్న వ్యక్తి కెసిఆర్ ఒక్కడే ఉన్నాడని అన్నారు. రైతు బంధుతో వ్యవసాయ దారులు సంతోషంగా పంటలు పండిరచుకుంటున్నారని అన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు, మిషన్ కాకతీయ ద్వారా పంటలకు సాగు నీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు. వ్యవసాయానికి 24 గం ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రైతు పండిరచిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనకపోతే కెసిఆర్ రైతులు నష్ట పోకుండా వడ్లను తెరాస ప్రభుత్వం కొంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉన్నపుడే బంగారు తెలంగాణ సాధ్యం అని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ దిశగా అడుగులు వేస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోని వెళ్తున్నారని అన్నారు.
నిరుద్యోగులకు శుభవార్తగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం జరిగిందని అన్నారు. గాంధారి మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.10 కోట్ల రూపాయలతో మండల కేంద్రంలో రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. అదేవిదంగా గ్రామ గ్రామాన సీసీ రోడ్డు పనులు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పుడూ లేని విదంగారాష్టంలో వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లు మొదలు కొని ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజలతో కలిసి వారితో మమేకమై పనిచేస్తున్న మేము అందరం అదృష్టవంతులం అని ఎమ్మెల్యే సురేందర్ సంతోషం వ్యక్తం చేశారు.
మండలంలో 117 కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్, వైస్ ఎంపీపీ భజన్, సర్పంచ్ సంజీవ్ యాదవ్, సొసైటీ చైర్మన్ సాయి కుమార్, ఎంపీటీసీలు పత్తి శ్రీనివాస్, బాలరాజ్,ఉప సర్పంచ్ రమేష్ తెరాస నాయకులు ముకుంద్ రావు, శివాజీ రావు,సత్యం, మనోహర్ రావు, రెడ్డి రాజు తహసీల్దార్ గోవర్ధన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.