కామారెడ్డి, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు 69, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు 41 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డిఇఓ రాజు, పోస్టల్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.