అనాధ బాలికకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి కేంద్రంలోని అనాధ ఆశ్రమంలో శిరీష (13) బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి 3 యూనిట్ల ఓ నెగిటివ్‌ రక్తం అవసరం ఉన్నదని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన కిరణ్‌ 47 వ సారి, టేక్రియాల్‌ గ్రామానికి చెందిన రాజు 4వ సారి వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సరే సకాలంలో రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని, యువకులు రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్‌ రక్తనిధి టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »