కామారెడ్డి, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో గల కోకా దుకాణాల వెనుక భాగంలో రైల్వే స్టేషన్ ప్రక్కనుంచి ఓరియంటల్ స్కూలు వరకు అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, పొదలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చేలరేగి మొత్తం వ్యాపించాయి.
సకాలంలో స్థానికుల సమాచారం మేరకు ఫైరింజన్ల సహాయంతో నీళ్ళు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. చిరు వ్యాపారులకు అస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు.