కామారెడ్డి, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులు వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో ఆదివారం అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
క్రీడల వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ పెరుగుతోందని సూచించారు. క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతోందని చెప్పారు. క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షకులు శివ గౌడ్, శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రతినిధులు సురేందర్ రెడ్డి, అనిల్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.