డిచ్‌పల్లి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్ చైర్ పర్సన్ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్ – కోర్ట్) నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోర్ట్ నుంచి సీనియర్ అడ్వకేట్ రామాగౌడ్ ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, పాలనా వ్యవహారాలలో భాగస్వామ్యం అయ్యారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు చెందిన నమూనా కేసులను గ్రహించి తమ తమ వాద ప్రతివాద పటిమను ప్రదర్శించారు.
మూట్ – కోర్ట్ లో పాల్గొన్న ఆరవ సెమిస్టర్ ఎల్‌ఎల్‌బి విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి శుభాభినందనలు తెలిపారు.