కామారెడ్డి, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఏవో రవీందర్, జిల్లా బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు కపిల ప్రభాకర్, వీరన్న పటేల్, ఇంద్ర శేఖర్, సంగమేశ్వర్, జిల్లా జంగం సమాజం అధ్యక్షుడు మఠం విజయ్ కుమార్, ప్రతినిధులు మహాదేవ స్వామి, వీరయ్య, సంగప్ప, తెలంగాణ బీసీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రేవంత్, ఉద్యోగులు పవన్, సునీత, గాయత్రి, విజయశాంతి, నరేష్, స్వామి పాల్గొన్నారు.