కామారెడ్డి, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర రంజాన్ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ పక్కన గల ఖదిం ఈద్గవద్ద మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ ముస్లింలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ చెప్పారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత 30 రోజులుగా నిష్టగా కఠోర ఉపవాస నియమం ఆచరించిన ముస్లింలు మంగళవారం రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారన్నారు. వారు కోరుకున్న వన్ని జరగాలన్నారు. ఉపవాసం అనేది పేదవారు ఆకలితో అలమటిస్తూ జీవించే వారి కష్టాలు తెలుసుకోవడానికి మనము ఉపవాసం ఉంటే తిండి లేని వారు ఎలా ఆకలితో అలమటిస్తున్నారో మనకు తెలిసి వచ్చి మనలో దానగుణం పెరుగుతుందన్నారు.
ఇస్లాం మతా ఆచారానికి సైన్స్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. హలాల్ తినే ఏ మాంసాహారాన్ని కైనా మేక అయిన కోడి అయిన హలాల్ చేయడం ద్వారా దాని శరీరంలోని చెడురక్తం పూర్తిగా పోయి మాంసం మాత్రమే మిగులుతుంది దీని ద్వారా మన దేహానికి హాని ఎలాంటి జరగదన్నారు. హిజాబ్ దీనిని ధరించడం వలన ఎన్నో అంటూ రోగాలకు, ముఖ సౌందర్యానికి రక్షణగా ఉంటుందని, పోకిరి ఆకతాయిల నుండి కూడా రక్షణ పొందవచ్చన్నారు.
కరోనా మహమ్మారి వలన రెండు సంవత్సరాల నుండి ప్రజలు అల్లాడిపోయారు, ఎందరో ముఖ్యులను కోల్పోయారు, దేవుని దయతో అందరితో కలిసి నమాజు చేసే భాగ్యం కలిగిందన్నారు. కరోనా మహమ్మారి పీడ తొలగి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను అన్నారు.