ఓయూ విసి అప్రజాస్వామిక తీరును వ్యతిరేకించండి

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యబద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తుండగా విసి ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, అప్రజాస్వామిక అరెస్టులను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షురాలు కల్పన పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత విసి బాధ్యతలు చేపట్టినప్పడి నుండి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిర్వహించే సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా యూనివర్సిటీకి ఉండే విశాలమైన, ప్రజాస్వామిక అర్థాన్ని కురుచుగా మార్చేశాడని, తెలంగాణలో నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి విసి మద్దతుగా ఉంటున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామిక వాదులు యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలని ఆలోచన చేస్తే విసి జీర్ణించుకోలేక పోతున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ సభకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ అంటేనే భిన్నమైన ఆలోచనలకు, విస్తృతమైన చర్చలకు వేదిక. గతంలో ఓయూలో చదివిన విద్యార్థులు నేడు స్వదేశం, విదేశాల్లో ఆర్థిక, రాజకీయ, వివిధ రంగాల్లో స్థిరపడిన వారున్నారని గుర్తుచేశారు.

ఇంతటి విస్తృతమైన, విశాలమైన యూనివర్సిటీలో నిరంకుశ, అప్రజాస్వామిక పద్ధతులను విసి విడనాడి రాహుల్‌ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని, దేశ విద్యావ్యవస్థనూ, రాజకీయాలనూ, దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై భవిష్యత్తులొ ఎవరు సభలు నిర్వహించిన అనుమతి ఇవ్వాలని పీడీఎస్‌యూ డిమాండ్‌ చేస్తుందన్నారు.

అరెస్టయిన వారిలో పిడిఎస్‌యు తెలంగాణ స్టేట్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.నాగేశ్వర రావు, ఏఐఎస్‌ఎఫ్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ సెక్రటరీ రవి నాయక్‌, పిడిఎస్‌యు ఓయూ అధ్యక్షులు ఎన్‌.సుమంత్‌, పిడిఎస్‌యు ఓయూ సెక్రటరీ స్వాతి, ఎస్‌ఎఫ్‌ఐ పవన్‌,గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్‌ నాయక్‌. తదితరులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఓయూ విసికి గాజులు, చీరలు పంపిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల తీరును కూడా ఖండిస్తున్నామని కల్పన పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »