నందిపేట్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలోని రాంనగర్ కాలనీలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రజల స్వచ్ఛంద విరాళాలు దాదాపు కోటి రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామితో పాటు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పాల్గొనగా వీరికి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శిలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భక్తులకు భారతి స్వామి ప్రవచనాలు చేశారు. ప్రతి ఒక్కరూ చేసే పనిలో ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంతో కర్తదిక్షతో పనిచేస్తే విజయం సాదించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ హిందు సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని సూచించారు.