సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి

కామారెడ్డి, మే 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. సృజనాత్మకతను వెలికి తీసే వేదిక కళాభారతి కావాలని అని తెలిపారు.

కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్‌ లాంటి నాయకులు దొరకడం అదృష్టమన్నారు. కామారెడ్డి పట్టణ సుందరీకరణకు పాటుపడుతున్న వ్యక్తి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అని కొనియాడారు. ఆర్‌అండ్‌బి మంత్రిగా తాను సైతం ఆశ్చర్యపోయేవిదంగా కామారెడ్డి పట్టణంలో ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం చేశారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు మొక్కుబడిగా కాకుండా తాను దగ్గరుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్మిస్తున్నారని అన్నారు.

కామారెడ్డి నియోజికవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు గంప గోవర్ధన్‌కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇంత గొప్పకళాభారతి ఆడిటోరియంను తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో ఇంత మంచి ఆడిటోరియం నిర్మాణానికి నిధులు కేటాయించి సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కెటిఆర్‌లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందూ ప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వరరావు, మునిసిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »