కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సహకార సంఘాల కార్యదర్శులు, ఉప తహసీల్దార్లతో దాన్యం కొనుగోళ్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి విక్రయించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్‌కు తరలించే విధంగా ఉప తాసిల్దార్‌లు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కేంద్రాల వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఇంచార్జ్ జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా సహకార అధికారి వసంత, అధికారులు పాల్గొన్నారు.