కామారెడ్డి, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని జూనియర్ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు.
పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్, అధికారులు బాలాజీ రావు, అజ్మల్ ఖాన్ పాల్గొన్నారు.