కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, లయోలా హై స్కూల్లో శనివారం పదోవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇష్టపడి చదివి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
ఏ, గ్రేడ్ మార్కులు సాధించడానికి విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో కి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుక రావద్దని చెప్పారు.పదోతరగతి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు తెలిపారు.
ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ఉపాధ్యాయులు వాణిశ్రీ, ప్రకాష్ పాల్గొన్నారు.