కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలను 100 శాతం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఐకెపి, మెప్మా అధికారులతో రుణాల పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలతో మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేపట్టి జీవనోపాధి పొందాలని సూచించారు. పది మందికి ఉపాధి కల్పించే విధంగా వ్యాపారాలు చేపట్టాలని అని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలతో పాడి పరిశ్రమ, బిస్కెట్ల, చాక్లెట్ల తయారీ, చేపల పెంపకం వంటి వ్యాపారాలు చేపట్టాలని కోరారు. మహిళలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంబన సాధించాలని కోరారు.
స్త్రీ నిధి రుణాలు మహిళలు తీసుకొని క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ సాయన్న, జోనల్ మేనేజర్ రవికుమార్, ఐకెపి, స్త్రీ నిధి అధికారులు పాల్గొన్నారు.